- Advertisement -
గచ్చిబౌలిలో యువకుడు అనుమానస్పద మృతి చెందాడు. హర్షవర్ధన్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి కొండాపూర్ క్వాక్ పబ్‌లో పార్టీకి వెళ్లాడు. తర్వాత అపార్ట్‌మెంట్‌కు వచ్చి మరోసారి మద్యం తాగాడు. దీంతో తెల్లవారుజామున హర్షవర్దన్‌కు విపరీతంగా వాంతులు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు హర్షవర్ధన్‌ని ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు. దీంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు.. అనుమానాస్పద స్థితిలో మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -