- Advertisement -
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు గుడ్‌న్యూస్. తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్‌లలోని (Andhra Pradesh) కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు (Monsoons) ప్రవేశించాయి. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల్లో రుతుపవనాలు మిగితా ప్రాంతాలను కూడా తాకే అవకాశం ఉందని పేర్కొంద. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో సోమవారం నుంచి గురువారం వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుసే అవకాశం ఉందని స్పస్టం చేసింది.
- Advertisement -