Thursday, May 29, 2025

2026 సంక్రాంతి బరిలో యంగ్ హీరో.. రిలీజ్ డేట్ ప్రకటన

- Advertisement -
- Advertisement -

నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty).. చేసిన సినిమాలు తక్కువైనా.. మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ‘జాతి రత్నాలు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నవీన్.. ఆ తర్వాత ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. ఈ సినిమా అంతగా ఆడకపోయినా.. నవీన్ (Naveen Polishetty) యాక్టింగ్‌కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. త్వరలో అతను ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వీడియోలకు విశేష స్పందన వచ్చించింది.

మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ వెల్లడించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను 2026 జనవరి 14వ తేదీన విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ చిన్న గ్లింప్స్‌ని కూడా విడుదల చేసింది. అందులో బైక్‌పై కూర్చొని లుంగీతో మాస్ లుక్‌లో నవీన్ మనకి కనిపిస్తున్నాడు. ‘ఈ సంక్రాంతికి దద్దరిల్లే నవ్వులని ఆనందాన్ని తీసుకొస్తున్నాము’ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. మరి సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలతో ఈ సినిమా ఢీ కొట్టి ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో తెలియాలంటే.. జనవరి 14, 2026 వరకూ వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News