త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు
ఆర్మూర్, కూసుమంచి సబ్ రిజిస్ట్రార్
కార్యాలయాల్లో తక్షణమే ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్:అవినీతిరహితంగా , పారదర్శకంగా, సమయాన్ని ఆదా చేయాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువస్తున్న నే పథ్యంలో ఆధార్ -ఈ సంతకం కూడా వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర రెవె న్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆ దేశించారు. ఈ ఆధార్-ఈ సంతకం వల్ల 10 నుం చి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌ల శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్‌తో కలిసి స్లాట్ బుకింగ్ విధానం, పనిభారం అధికంగా ఉ న్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు రిజిస్ట్రార్ల పోస్టింగ్, పదోన్నతి పొందిన ఉద్యోగులకు పోస్టింగ్‌లపై మంత్రి సోమవారం సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్లాట్ బు కింగ్‌తో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్- ఈ సంతకం ప్రవేశపెడుతున్నామని పొంగులేటి తెలిపారు. ముందుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తక్షణమే అమల్లోకి తీసుకువస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకువస్తున్న నేపథ్యంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పఠాన్‌చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనంగా సబ్ రిజిస్ట్రార్‌లను నియమించామన్నారు. అవినీతికి దూరంగా ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ ప్రభుత్వ పేరు ప్రతిష్టలు పెంచే విధంగా సబ్ రిజిస్ట్రార్ల పనితీరు ఉండాలని మంత్రి ఆదేశించారు.