Thursday, May 29, 2025

ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

వాహనం ఢీకొట్టడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్‌ఆర్ కోకాపేట టోల్‌ప్లాజా ఎగ్జిట్ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎగ్జిట్‌కు 400మీటర్ల దూరంలో ఓ గుర్తుతెలియని వ్యక్తిని వాహనం ఢీకొట్టిందని డయల్ 100 ద్వారా సమాచారం రావడంతో పిసిలు రాములు, రవీందర్ వెళ్లారు. యువకుడు(25 నుంచి 30) ఏళ్లు ఉంటాయి. గుర్తుతెలియని వాహనాన్ని డ్రైవర్ నిర్లక్షంగా అతివేగంగా నడపడంతో యువకుడిని వాహనం ఢీకొట్టింది. దీంతో వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన యువకుడిని గుర్తించిన వారు వెంటనే 9490617189,8712663115కు ఫోన్ చేయాలని నార్సింగి పోలీసులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News