- Advertisement -
ముమ్మిడివరం: కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంకలో దారుణం చోటు చేసుకుంది. గోదావరిలో మునిగి ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు (Youths Drowning). కె.గంగవరం మండలం శురుల్లంకలో శుభకార్యానికి వచ్చిన వారిలో 11 మంది స్నానం కోసం గోదావరి నదిలో దిగారు. అయితే అందులో కొందరు లోతైన ప్రాంతం కావడంతో 8 మంది గల్లంతుకాగా.. ముగ్గురు సురక్షితంగా బయటకు వచ్చారు. గల్లంతైన (Youths Drowning) వారిని కాకినాడ, రామచంద్రపురం, మండపేటకు చెందిన క్రాంతి, పాల్, సాయి, సతీష్, మహేశ్, రాజేశ్, రోహిత్, మహేశ్‌లుగా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -