- Advertisement -
ఓ రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఖమ్మం రూరల్ సబ్‌రిజిస్ట్రార్ అరుణ సోమవారం ఎసిబి వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..ఖమ్మం నగరానికి చెందిన ఓ వ్యక్తికి ఖమ్మం రూరల్ మండలం, తల్లంపాడులో రెండువేల గజాల స్థలం ఉంది. దీనిని తన కుమారుడి పేరుపై గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్‌రిజిస్ట్రార్‌ను అడగగా రూ.లక్ష వరకు డిమాండ్ చేశారు ఆ డబ్బులను ఇచ్చేందుకు నిరాకరించిన బాధితుడు ఎసిబికి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఎసిబి అధికారులు ట్రాప్ చేసి సబ్‌రిజిస్ట్రార్‌కు సంబంధించిన డాక్యుమెంట్ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్వరరావుకు ముందుగా రూ.30 వేలు ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం తీసుకున్న డబ్బులను సబ్‌రిజిస్ట్రార్‌కు కార్యాలయంలో అందిస్తుండగా వారిద్దర్నీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -