- Advertisement -
బాసర గోదావరి నది పుణ్య స్నానానికి వచ్చిన భక్తులలో వేరు వేరు ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మహారాష్ట్ర పర్బని జిల్లాలోని టాక్లి గ్రామానికి చెందిన బాలుడు కుల్దీప్ బాల సాహెబ్ (11), నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బొల్ల మల్లరాజు (40) ప్రమాదవశాత్తు గోదావరిలో పడి మృతి చెందారు. అమ్మవారి దర్శనానికి వచ్చి స్నానపు ఘాట్ల వద్ద తమవారి మృతదేహాలను చూసి విలపిస్తున్న తీరు అక్కడ ఉన్నవారిని కలిచివేసింది. మృతదేహాలను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -