భారత్‌కు సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న వారిని గుర్తించి అరెస్టులు చేస్తున్నారు. ఈ జాబితాలో సీఆర్‌పిఎఫ్‌కు చెందిన సిబ్బంది ఒకరు ఉండటం కలకలం సృష్టిస్తోంది. తాజాగా సీఆర్‌పీఎఫ్ ఉద్యోగి మోతారామ్ జాట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపు లోకి తీసుకుంది. 2023 నుంచి పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో అతడు టచ్‌లో ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ‘ నిందితుడు మోతీరామ్ జాట్ గూఢచర్యానికి పాల్పడ్డాడు. దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో పంచుకున్నారు. వేర్వేరు మార్గాల్లో పీఐఓల నుంచి డబ్బులు అందినట్టు గుర్తించాం. ” అని ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ అభియోగాలపై అతడిని ఢిల్లీలో అదుపు లోకి తీసుకున్నారు.
ప్రత్యేక న్యాయస్థానం అతడిని జూన్ 6 వరకు ఎన్‌ఐఎ కస్టడీకి అప్పగించింది. పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. కొన్ని వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 10 మందికి పైగా అరెస్టయిన సంగతి తెలిసిందే. పహాల్గాం ఉగ్రదాడి , ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నిత మైన సమాచారాన్ని చేరవేస్తున్నట్టు ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందన్నారు. వారి ఆర్థిక లావాదేవీలను సునిశితంగా పరిశీలిస్తున్నామని , ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా చేస్తున్నట్టు చెప్పారు.