Thursday, May 29, 2025

పాక్ ద్వేషంతో బతుకుతోంది.. ఎప్పుడూ అదే ఆలోచన : పిఎం మోడీ

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్‌పై ప్రధాని నరేంద్రమోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ దేశం ఏకైక లక్షం భారత్‌ను ద్వేషించడం, మనకు హాని కలిగించే మార్గాల గురించి ఆలోచించడమేనని మండిపడ్డారు. కానీ భారత్ మాత్రం దేశం లోని పేదరికాన్ని నిర్మూలించి ఆర్థికాభివృద్ధి సాధించే లక్షంతో ముందుకెళ్తోందన్నారు. సోమవారం గుజరాత్ లోని దావోద్‌లో రూ.24 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఇటీవల భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను ప్రశింసించిన ప్రధాని … మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచిపెట్టే దుస్సాహసానికి ఒడిగట్టిన వారి ముగింపు దగ్గరపడినట్లేనని తెలిసేలా చేశామన్నారు. దేశ విభజన తర్వాత ఏర్పాటైన పాకిస్థాన్ భారత్ పట్ల ద్వేషంతో బతుకుతోందని మనకు హాని చేయాలనుకుంటోందని మండిపడ్డారు. కానీ భారత్ మాత్రం పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి సాధించడం, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడమే లక్షంగా నిర్దేశించుకొని ముందుకెళ్తోందని చెప్పారు. 2014లో ఇదే రోజు తొలిసారి పీఎంగా బాధ్యతలు చేపట్టానని నరేంద్రమోడీ గుర్తు చేసుకున్నారు.

తొలుత గుజరాత్ ప్రజలు తనను ఆశీర్వదించారని , తర్వాత కోట్లాది మంది భారతీయులు ఆశీస్సులు అందించారని, వ్యాఖ్యానించారు. సోమవారం గుజరాత్ పర్యటనలో ఉన్న ఆయన దాహోద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఆయనను ఘనంగా సత్కరించారు. దాహోద్‌లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. వెరావల్ అహ్మదాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్, వల్సాద్ దాహోద్‌ల మధ్య ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపారు. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. “ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా మార్చేందుకు 140 కోట్ల మంది ప్రజలు ఐక్యంగా పనిచేస్తున్నారు. ఈ 11 ఏళ్లలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం. దశాబ్దాల నాటి సంకెళ్లను బద్దలు కొట్టి, దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చుతున్నాం. కార్లు, ఫోన్లు, బొమ్మలు , ఆయుధాలు ఎగుమతి చేస్తున్నాం. మూడు సంవత్సరాల క్రితం ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశాను. దీనిపై ఎన్నో విమర్శలు వినిపించాయి. ఎన్నికల సమయం కాబట్టి ప్లాంట్‌కు పునాది వేశారు కానీ ఏ నిర్మాణాలు చేపట్టరని విమర్శించారు.

కానీ ఈరోజు ఇక్కడ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తయారైంది. అది మనకు కనిపిస్తోంది ” అని మోడీ అన్నారు. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ “2022 లో ఆధునిక ఎలక్ట్రిక్ ఇంజిన్లను తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2023లో ఆ దిశగా పని మొదలైంది. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ సిద్ధమైంది.” అని వెల్లడించారు. వేదిక వద్దకు చేరుకోవడానికి ముందు మోడీ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేశారు. ఆ ర్యాలీలో కర్నల్ సోఫియా ఖరేషీ కుటుంబం పాల్గొంది. వారు మోడీ పై పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వివరించడంతో సోఫియా పేరు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News