Thursday, May 29, 2025

 కేరళ తీరంలో భారీ సరుకు నౌక మునక

- Advertisement -
- Advertisement -

కేరళ తీరానికి భారీ స్థాయి పరిణామంలో చమురు తెట్టు ముప్పు తలెత్తింది. లైబేరియా రవాణా నౌక ఎంఎస్‌ఇ ఎల్సా 3 కేరళ తీరపు దక్షిణ ప్రాంతంలోని కొల్లాంకు సమీపంలో సముద్రంలో మునిగింది. ఈ భారీ స్థాయి రవాణా నౌక అత్యంత ప్రమాదకర, సముద్ర జలచరాల ప్రాణాంతకమైన పదార్థాలు ఉన్నాయి. మొత్తం 13 కంటైనర్లలో 12 వరకూ విష ప్రమాదకర కాల్షియం కార్బైడ్ రసాయనాలు ఉన్నాయని వెల్లడైంది. సముద్ర పర్యావరణానికి ఇక్కడ విస్తరించుకునే చమురు తెట్టు పొరలు నష్టం కల్గిస్తాయని ఆందోళన చెందుతున్నారు. ట్యాంకులో వందలాది టన్నుల ఇంధనం కూడా ఉందని కోస్ట్ గార్డు తెలిపారు. ఈ భారీ నౌక క్రమేపీ సముద్రంలోకి కూరుకుపోతూ ఉండటాన్ని గుర్తించిన తీర ప్రాంత రక్షక దళాలు సకాలంలో రంగంలోకి దిగాయి. దీనితో నౌక సిబ్బంది ప్రాణాపాయం నుంచి గట్టెక్కింది. నౌక అదుపు తప్పడంతో కంటైనర్లు సముద్రంలోకి ఒరిగిపొయ్యాయి. నౌక ఎందుకు మునిగిపోయిందని వెంటనే తెలియలేదు. ఈ ప్రాంతంలో కాలుష్య విస్తరణ నివారణకు వెంటనే భారతీయ నౌకదళం, తీర ప్రాంత రక్షక దళం వెంటనే రంగంలోకి దిగింది.

ముందుగా ఈ ప్రాంతంలోకి కాలుష్య నివారణ యంత్రాలతో కూడిన సాక్షం నౌకను ప్రవేశపెట్టారు. ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో చమురు తెట్టెలు విస్తరించకుండా చేసేందుకు అవసరం అయిన చర్యల గురించి సిబ్బంది కార్యక్షేత్రంలోకి దిగింది. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత నౌక మునిగిన ఘటన జరిగింది. సోమవారం కొల్లాం తీరంలో నౌకా దళం పెద్ద ఎత్తున జాగ్రత్తలకు దిగింది కొన్ని కంటైనర్లు తీర ప్రాంతం వైపు విషపూరిత చమురుతో కొట్టుకుంటూ రావడంతో స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నౌక సిబ్బందిలో రష్యా, ఉక్రెయిన్ జార్జియాకు చెందిన వారు ఉన్నారని వెల్లడైంది. ఈ కేరళ తీరంలో ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతం సుసంపన్న జీవ వైవిధ్య ప్రాంతం. అంతేకాకుండా భారతదేశపు అత్యంత ప్రసిద్ధి గాంచిన పర్యాటక స్థలం. ఇక్కడికి కాలుష్య కాసారం ముప్పు ఏర్పడటంలో స్థానికంగా అధికారులలో కలవరం ఏర్పడింది. ఎప్పటికప్పుడు చమురు తెట్టు వ్యాప్తిని గుర్తించే పరికరాలు, తీసుకోవల్సిన జాగ్రత్తల యంత్రాలతో కూడిన ప్రత్యేక విమానాలను ఈ ప్రాంతంలో మొహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News