Thursday, May 29, 2025

నంబాలను బంధించి కాల్చి చంపారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అ లియాస్ బసవరాజు మృతిపై మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. నంబాల కేశవరావను పట్టుకుని తర్వాత భద్రతా దళాలు కాల్చి చంపాయని తెలిపారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడదుల చేసింది. లొంగిపోయిన మావోయిస్టులు అందించిన సమాచారం తోనే భద్రతాదళాలు అక్కడ కూం బింగ్ జరిపాయని అందులో పేర్కొన్నారు. మావోయిస్టు స్పెషల్ జోనల్ కమి టీ ప్రతినిధి వికల్ప పేరిట మావోయిస్టులు సోమవారం లేఖ విడుదల చేశారు. తమ నాయకుడిని కాపాడుకోవడంలో తాము విఫలమయ్యామని తెలిపారు. కేశవరావు టీంలో ఉన్న ఆరుగురు సభ్యులు ఇటీవల ప్రభుత్వానికి లొంగిపోయారని వారు ఇచ్చిన సమాచారంతోనే ఇంతటి దారుణం జరిగిందని తెలిపార. ఎన్ కౌంటర్ ముందు రోజు నుంచి ఇరవై వేలమంది భద్రతాబలగాలు తమ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, పది గంటల్లో ఐదు ఎన్ కౌంటర్లు జరిగాయని తెలిపారు. కేశవరావు 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసన్నారు.

నంబాల భద్రతలో ప్రధాన పాత్ర పోషిస్తోన్న సివైపిసి సభ్యులు కూడా ద్రోహానికి పాల్పడ్డ వారిలో ఉన్నారని తెలిపారు. మాడ్ ఉద్యమానికి నాయకత్వం వహించిన యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు కూడా దేశద్రోహిగా మారాడని, దీంతో భద్రతా దళాల పని సులువైందని, రీకితో సహా ఈ దేశ ద్రోహు లందరూ కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని తెలిపారు. నారాయణపూర్ జిల్లా మాడ్ ప్రాంతంలోని గుండెకోట్ అడవిలో 2026, మే 21 జరిగిన ఎన్ కౌంటర్లో నంబాల మృతి చెందారని ధృవీకరించారు. ఆయనతో పాటు మరో 28 మంది మావోయిస్టులు మరణించారని వెల్లడించారు. ఈ మేరకు ఈ ద్రోహుల కారణంగానే ఇంత పెద్ద నష్టాన్ని చవి చూడాల్సి వచ్చిందని, మే 19న నంబాల ఉన్న సమీప గ్రామానికి పోలీసు బృందం చేరుకుందని సమాచారం అందిన తర్వా త ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి బయలుదేరాం. 19వ తేదీ ఉదయం నుంచి ఐదు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి కానీ ఎటువంటి నష్టం జరగ లేదు. -మే 20 రాత్రి వేలాది మంది పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. 60 గంటల పాటు భద్రత దళాలు నిర్భంధించాయి.

కేశవ రావును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించాం. కానీ మమ్మల్ని వదిలి బయటకు వెళ్లేందుకు ఆయన ఇష్టపడలేదు. ముందుండి మమ్మల్ని నడిపించారు. కేశవరావుని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారు. కానీ మే 21న జరిగిన ఆపరేషన్‌లో నంబాలతో పాటు 28 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు ’అని సదరు లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించిందని, అయితే, మరో మృతదేహాన్ని తాము తీసుకెళ్లామని లేఖలో వెల్లడించారు. పాక్ తో శాంతి చర్చలకు సిద్ధమైన భారత ప్రభుత్వం తమతో మాత్రం చర్చలకు సిద్ధం కాలేదని మావోయిస్టులు లేఖలో పర్కన్నారు. తాము కాల్పుల విరమణను పాటించినా భద్రతాదళాలు మాత్రం దానిని పాటిచంలేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News