Thursday, May 29, 2025

కరోనా.. విజృంభణ

- Advertisement -
- Advertisement -

వెయ్యి దాటిన కేసులు
దేశవ్యాప్తంగా
అప్రమత్తం ఢిల్లీలో
104, కేరళలో 460
క్రియాశీల కేసులు
భయం వద్దు
ఐసిఎంఆర్ సూచన

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు నమోదవుతుండడం కలవరం కలిగిస్తోంది. క్రియాశీల కేసుల సంఖ్య 1009 వరకు ఉండగా, వారం వ్యవధి లోనే 752 మందికి కొత్తగా కరోనా సోకిందని సోమవారం ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఢిల్లీలో ప్రస్తుతం 104 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. ఒక వారం లోనే 99 మంది దీని బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం రాష్ట్రాల వారీగా కొవిడ్ కేసులు ఇలా ఉన్నాయి. కేరళలో అత్యధికంగా 430 క్రియాశీల కేసులు ఉండగా,

మహారాష్ట్రలో 209,ఢిల్లీలో 104,గుజరాత్‌లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, రాజస్థాన్‌లో 13, పశ్చిమబెంగాల్‌లో 12. పుదుచ్చేరిలో 9, హర్యానాలో 9,ఆంధ్రప్రదేశ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 2, తెలంగాణ, గోవా, ఛత్తీస్‌గఢ్‌ల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. తాజాగా బీహార్‌లో ఒక కేసు నమోదైనట్టు సమాచారం. అయితే కేసులు నమోదవుతున్నప్పటికీ, తీవ్రత తక్కువేనని ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని తెలిపిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News