Thursday, May 29, 2025

కారులో సూసైడ్!.. ఒకే కుటుంబంలోని ఏడుగురు అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

పంచకుల: కారులో ఒకే కుటుంబంలోని ఏడుగురు అనుమానాస్పదంగా మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన హర్యానాలోని పంచకుల జిల్లాలో చోటుచేసుకుంది. డెహ్రాడూన్‌కు చెందిన ఒక కుటుంబం కారులో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పంచకులలోని సెక్టార్ 27లోని ఓ ఇంటి వద్ద రోడ్డుపై ఆపి ఉన్న కారులో ఏడుగురు చనిపోయినట్లు గమనించిన స్థానికులు వెంటనేయ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఏడుగురు మృతదేహాలను పంచకులలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

మరణించిన వ్యక్తిని డెహ్రాడూన్‌కు చెందిన ప్రవీణ్ మిట్టల్(42)గా గుర్తించారు. అతనితో పాటు అతని తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సంఘటన స్థలం నుండి పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పులు, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ కుటుంబం కారులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న పంచకుల డిసిపి హిమాద్రి కౌశిక్, డిసిపి (శాంతిభద్రతలు) అమిత్ దహియా సంఘటనా స్థలానికి చేరుకుని సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News