బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం (Bhairavam)టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెళ్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీగా నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న సమ్మర్ సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ “తప్పకుండా విజయ్ పెద్ద హిట్ కొడతాడు. మనోజ్, రోహిత్, శ్రీను చాలా మంచి యా క్టర్స్. యాక్షన్ సినిమాలు చూసే వారందరికీ ‘భైరవం’ నచ్చుతుంది”అని తెలియజేశారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడి ఇష్టపడి మీ అందరికీ ఒక మం చి సినిమా ఇవ్వాలని ఉద్దేశంతో చేశాం. డైరెక్టర్ విజయ్ సినిమాని చాలా కష్టపడి తీశారు.
ఆయన హార్డ్ వర్క్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఈ సినిమా ఫైనల్ కట్ చూశాను. అదిరిపోయింది. మామూలుగా ఉండ దు. మే 30న మనందరికీ పెద్ద పండగ. ఆ పండగలో మీరందరూ భాగం కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ “ముగ్గురు హీరోలతో సినిమా చేయడం అంటే కొందరు భయపడతారు. నేను కూడా ముందు భయపడ్డాను. కానీ మాకు ముగ్గురు కూతుళ్లు ముగ్గురు అల్లుళ్ళు వచ్చినట్టుగా అనిపించింది. భైరవం సినిమా మా అంద రి కృషి ఫలితం”అని తెలిపారు. డైరెక్టర్ విజయ్ కనక మేడల మాట్లాడుతూ “సినిమాలో యాక్షన్ నెక్స్ లెవెల్ ఉంటుంది. శ్రీ చరణ్ నెక్స్ లెవెల్ ఆడియో ఇచ్చారు. మనోజ్, రోహిత్, సాయిలకు థాంక్యూ”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, నిర్మాత బెల్లంకొండ సురేష్, అతిధి శంకర్, ఆనంది, దివ్య, సంపత్ నంది, శ్రీచరణ్ పాకాల, అజయ్ తదితరులు పాల్గొన్నారు.