Thursday, May 29, 2025

లివర్‌పూల్ పరేడ్‌లో విషాదం.. అభిమానుల మీదకు దూసుకెళ్లిన కారు

- Advertisement -
- Advertisement -

లండన్: లండన్‌లో ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌షిప్‌ను జరుపుకుంటున్న లివర్‌పూల్ సాకర్ విక్టరీ పరేడ్ లో విషాదం చోటుచేసుకుంది. పరేడ్ లో భారీగా పాల్గొన్న అభిమానుల సమూహంపైకి ఓ కారు దూసుకెళ్లింది. గుంపుపైకి దూసుకెళ్లిన కారు కొంత దూరం వరకు జనాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లింది. దీంతో దాదాపు 47 మంది గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అత్యవస చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్, ఇతర అత్యవసర వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో నలుగురు పిల్లలు సహా ఇరవై ఏడు మందిని ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. మరో 20 మందికి సంఘటన స్థలంలోనే చికిత్స అందించినట్లు చెప్పారు. ఈ సంఘటనకు కారణం డ్రైవర్ మాత్రమేనని.. ఉగ్రవాద చర్యగా దర్యాప్తు చేయడం లేదని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News