- Advertisement -
అమరావతి: ప్రభుత్వం ఏర్పడి తర్వాత తొలిసారి టిడిపి మహానాడు నిర్వహిస్తోంది. మంగళవారం కడప శివారు చెర్లోపల్లిలో మహానాడు జరగనుంది. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశిస్తూ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. కార్యకర్తలే పార్టీకీ బలం, బలగమని.. పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గొప్పదని అన్నారు. పసుపు పండుగ మహానాడుకు అందరికీ ఘన స్వాగతం పలుకుతున్నానంటూ లోకేష్ పేర్కొన్నారు.
కాగా, ఇవాళ చెర్లోపల్లిలో జరగనున్న మహానాడుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సభకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా మహానాడులో ఆరు అంశాలపై తీర్మానం చేసే అవకాశం ఉంది. సిఎం చంద్రబాబు ఉపన్యాసంతో ఈ సభ ప్రారంభంకానుంది.
- Advertisement -