Thursday, May 29, 2025

టాప్ 2 కోసం పోరు… బెంగళూరుకు సవాల్

- Advertisement -
- Advertisement -

లక్నో: ఐపిఎల్ సీజన్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌కు రాయల్ ఛాలెంజర్స్ (Royal Challengers)బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్‌లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకున్న బెంగళూరుకు వరుస ఓటములు కలవర పెడుతున్నాయి. మరోవైపు నాకౌట్ రేసుకు దూరమైన లక్నో సూపర్ జెయింట్స్ చివరి మ్యాచుల్లో అసాధారణ ఆటతో అలరిస్తోంది. పటిష్టమైన గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సీజన్‌ను ముగించాలని భావిస్తోంది. ఇక బెంగళూరు కిందటి మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో పరాజయం చవిచూసింది.

అంతకుముందు కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయ్యింది. ఇలాంటి స్థితిలో పాయింట్ల పట్టికలో టాప్2లో నిలవాలని భావిస్తున్న బెంగళూరుకు ఈ పోరు కీలకంగా తయారైంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే బెంగళూరుకు టాప్2లో చోటు ఖాయమవుతోంది. ప్రస్తుతం బెంగళూరు 17 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న బెంగళూరు ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఓపెనర్లు విరాట్ కోహ్లి, పిల్ సాల్ట్‌లు జోరుమీదున్నారు. ఈ సీజన్‌లో కోహ్లి, సాల్ట్‌లు అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. మరోవైపు లక్నో ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మిఛెల్ మార్ష్, నికోలస్ పూరన్, అయుష్ బడోని, రిషబ్ పంత్, అబ్దుల్ సమద్ తదితరులతో జట్టు బ్యాటింగ్ బలంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News