Thursday, May 29, 2025

నమ్మి కథ చెబితే లీక్ చేశారు.. సందీప్ వంగా పోస్ట్ వైరల్

- Advertisement -
- Advertisement -

అర్జున్ రెడ్డి, యానిమాల్ వంటి సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ఇండస్ట్రీలను షేక్ చేశాయి. భారీ కలెక్షన్స్ రాబట్టి షాకిచ్చాయి. దీంతో ఇప్పడు సందీప్ తీయబోయే సినిమాలపై అందరికీ అసక్తి నెలకొంది. ఈ క్రమంలో సందీప్.. ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా తీయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటులను ఎంపిక చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.

అయితే, ఈ మూవీ స్టోరీని లీక్ చేశారంటూ అరోపిస్తూ సందీప్ వంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తాను నమ్మి ఒకరికి కథ చెబితే లీక్ చేశారని చెప్పారు. తాను ఒక యాక్టర్ కి కథ చెబితే వారు దాన్ని లీక్‌ చేశారని..
తన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారని సందీప్ వంగా పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఈ సినిమాలో నటించనున్న హీరోయిన్ ను కూడా సెలక్ట్ చేశారు. ప్రభాస్ కు జోెడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. అంతకుముందు, దీపికా పడుకొణెను సంప్రదించగా.. ఆమె పలు కండీషన్లు పెట్టడంతో సందీప్ రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News