Thursday, May 29, 2025

కరోనా విజృంభన..: దేశవ్యాప్తంగా 1000 దాటిన కోవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చైనాలో పుట్టి.. ప్రపంచమంతా వ్యాప్తి చెంది.. లక్షలాది మంది ప్రాణాలు బలిగొన్న కోవిడ్(Covid-19) మరోసారి భారత్‌లో కోరలు చాస్తుంది. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్ వ్యాప్తి ప్రజలను కలవరపెడుతోంది. గత వారం రోజుల్లోనే 750 మందికి పైగా ఈ వైరస్ (Covid-19) బారిన పడినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీల్లో కొత్త కేసులు పెరిగినట్లు పేర్కొంది. కేరళలో కొత్తగా 335 ఇన్ఫెక్షన్లు నమోదు అయ్యయ

దీంతో కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 430కి చేరింది. మహారాష్ట్రలో 153, ఢిల్లీలో 104 కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్‌లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 12 కేసులు ఉన్నాయ. బాధితులు చాలా వరకూ ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని.. కేసుల పెరుగుదలతో భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర స్పష్టం చేసింది.

అధిక కేసుల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాపిడ్ రెస్పాన్స్ బృందాలతో సమావేశం నిర్వహించి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలప చర్చింది. వ్యాధి తీవ్రత లేకున్నా అందరూ జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News