తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ కు పిలుపునివ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగానే స్పందించారు. జూన్ 12న పవన్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ కానుంది. ఈ క్రమంలో బంద్ కు పిలుపునివ్వడంతో స్పందించిన పవన్.. తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపుతున్నానని చెప్పారు. తాజాగా మరోసారి రియాక్ట్ ఆయిన పవన్.. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని.. థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇక నుంచి తన సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే.. ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుందని.. థియేటర్ల బంద్ వెనుక ఉన్న శక్తులను గుర్తించి విచారించాలని పవన్ ఆదేశించారు. ఇందులో ఎవరున్నా చర్యలకు వెనుకాడవద్దని ఆయన తేల్చి చెప్పారు.