Thursday, May 29, 2025

ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు: శైలజానాథ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: మహానటుడు సీనియర్ నాయకుడు ఎన్టీఆర్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని, ఈ రోజు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూ ఉంటుందని, ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చించాలని మాజీ మంత్రి శైలజానాథ్ (Sailajanath) తెలిపారు. టిడిపిది మహానాడు కాదని, దగానాడని శైలజానాథ్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఘనుడు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. టిడిపికి నిజమైన వారసులు ఎవరు? అని ప్రశ్నించారు. అసలు వారసుడు బాలకృష్ణ దబిడి..దిబిడి అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలి? అని ప్రజల సంక్షేమం ఆపేసి.. విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారని శైలజానాథ్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News