టీం ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ టెస్ట్‌లకు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో శుభ్‌మాన్ గిల్‌కు (Shubhman Gill) కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను (Rishabh Pant) నియమించారు. జూన్ 20 నుంచి భారత్ జట్టు ఇంగ్లండ్‌లో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో జట్టుకు కెప్టెన్సీ చేయడం గిల్‌కు సవాల్ అనే చెప్పుకోవాలి. అయితే గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి జస్ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ దక్కాలి.. కానీ అతని ఫిట్‌నెస్ సమస్యలు, వర్క్‌లోడ్ కారణంగా అతనికి ఆ పదవిని కట్టబెట్టలేదు. మరోవైపు కెఎల్ రాహుల్, రిషబ్ పంత్‌ని కాదని శుభ్‌మాన్‌కి కెప్టెన్సీ అప్పగించారు.
అయితే గిల్‌కు(Shubhman Gill) కెప్టెన్సీ అప్పగించడంపై టీం ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్సీకి గిల్ రెండో బెస్ట్ ఆప్షన్ అని మాజీ క్రికెటర్ మనోజ్ తివారి అన్నారు. దీనిపై స్పందించిన సెహ్వాగ్.. తివారీ మాటలతో తన ఏకీభవించడం లేదన్నారు. బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వకపోవడం సరైనదే అన్న సెహ్వాగ్.. గిల్ బదులుగా రెండో బెస్ట్ ఆప్షన్ రిషబ్ పంత్ అని అన్నారు. పంత్ (Rishabh Pant) టెస్ట్ క్రికెట్‌కి చేసినంతగా ఇతర ఆటగాళ్లెవరూ చేయలేదని సెహ్వాగ్ తెలిపారు. విరాట్ తర్వాత టెస్ట్‌లు చూసేలా కట్టిపడేసింది పంత్ మాత్రమే అని అన్నారు.
యాక్సిడెంట్ అయినా కూడా ఆ ఛాయలు ఆటపై కనిపించకుండా శ్రమించాడని సెహ్వాగ్ పేర్కొన్నారు. ఇప్పుడు టీం ఇండియా టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ కూడా అయ్యాడని కొనియాడారు. పంత్ పడిలేచిన కెరటం అని.. భవిష్యత్తులో అయినా.. అతనికి కెప్టెన్సీ ఇవ్వాలని సెహ్వాగ్ సెలక్టర్లను కోరారు.