- Advertisement -
ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) 2025లో విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ తో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టుకు వెన్నుముకగా మారాడు. భారీగా పరుగులు చేస్తూ జట్టు విజయంతో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈసారి సమిష్టిగా రాణించడంతో బెంగూరు ప్లేఆఫ్ కు చేరుకుంది. మంగళవారం లక్నో జట్టుతో ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్ లో గెలిచి టాప్ 2లో చోటు దక్కించుకోవాలని బెంగళూరు భావిస్తోంది. ఈ క్రమంలో కోహ్లీని మరో రెండు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ రికార్డులకు కోహ్లీ ఒక అడుగు దూరంలో ఉన్నాడు. లక్నోతో జరగబోయే మ్యాచ్ లో కోహ్లీ మరో 24 పరుగులు చేస్తే టీ20ల్లో బెంగళూరు తరఫున 9 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. అలాగే మరో అర్ధశతకం కొడితే.. డేవిడ్ వార్నర్‌ను రికార్డును బ్రేక్ చేస్తాడు. ఐపిఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్‌సెంచరీలు బాదిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టిస్తాడు.
- Advertisement -