Thursday, May 29, 2025

ఐపిఎల్ చరిత్రలో ఒకేఒక్కడు.. శ్రేయస్ అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 29వ తేదీ నుంచి ప్లేఆప్స్ జరుగనున్నాయి. ఈ ప్లేఆఫ్స్‌లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కి పంజాబ్ కింగ్స్ జట్టు అర్హత సాధించింది. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన విజయం సాధించింది పంజాబ్. దీంతో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

గత ఏడాది ఐపిఎల్‌లో (IPL) కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ (Shreyas Iyer) జట్టును విజేతగా నిలిపాడు. అయినప్పటికీ.. కోల్‌కతా అతన్ని మెగా వేలానికి ముందే రిటైన్ చేసుకోలేదు. ఇక వేలంలో అతన్ని పంజాబ్ కింగ్స్ జట్టు రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. అంతేకాక.. జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది.

దీంతో జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని టోర్నమెంట్ ఆరంభం నుంచి నిలబెట్టుకుంటూ వస్తున్నాడు అయ్యరు. తాజాగా జట్టును తొలి క్వాలిఫయర్‌కి అర్హత సాధించేలా చేశాడు. దీంతో కెప్టెన్‌గా రెండు వేర్వేరు జట్లను క్వాలిఫయర్‌కి తీసుకు వెళ్లిన ఏకైక కెప్టెన్‌గా అతను రికార్డుల్లోకి ఎక్కాడు. 2020 ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అతను ఆ జట్టును రెండో స్థానానికి చేర్చాడు ఇప్పుడు పంజాబ్‌ని మొదటిస్థానంలో నిలబెట్టాడు. గతంలో ఎవరూ కూడా ఈ ఘనత సాధించలేదు. ఇక ఈ రోజు లక్నో, బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌లో క్వాలిఫయర్-1కి అర్హత సాధించే ఇంకో జట్టు ఏదో తెలిసిపోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News