Thursday, May 29, 2025

ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

ఆర్ట్స్, కామర్స్ చదువుకున్న విద్యార్థులకు శుభవార్త. భారతదేశంలో కమర్షియల్ పైలట్ శిక్షణ పొందేందుకు అవసరమైన విద్యా ప్రమాణాలలో పెద్దఎత్తున మార్పులు చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ) ఆలోచిస్తోంది. అందువల్ల ఆర్ట్స్, కామర్స్ గ్రాడ్యూయేట్ లు కూడా పైలట్ శిక్షణ పొందేందుకు అర్హత సాధించవచ్చు. దాదాపు మూడు దశాబ్దాల నాటి నిబంధనలను సవరించే విషయాన్ని డిజిసిఏ పునరాలోచిస్తోంది. 1990వ దశకంలో సైన్స్ , మాథ్స్ స్ట్రీమ్ విద్యార్థులు మాత్రమే కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందేందుకు అర్హులనే నిబంధనను తీసుకువచ్చారు. ఇప్పుడు ఆర్ట్స్ , కామర్స్ స్ట్రీమ్ ల విద్యార్థులకు పైలట్ శిక్షణ పొందేందుకు అనుమతించాలని భావిస్తున్నారు. ఈ మేరకు డిజిసిఏ ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు తన సిఫార్సులను పంపింది. మంత్రిత్వశాఖ ఆమోదించిన తర్వాత కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు పంపుతుంది. అనంతరం నోటిఫికేషన్ విడుదల కాగలదు.

అనంతరం అభ్యర్థులు మెడికల్, ఇతర అర్హత పరీక్షలలో తమ ప్రతిభ నిరూపించుకుని అర్హత సాధించవలసి ఉంటుంది. ఇటీవల కాలంలో పలు విమాన సంస్థలు పౌర విమానరంగంలోకి రావడంతో కమర్షియల్ పైలెట్ల అవసరం హెచ్చింది. దీంతో ఇప్పటికే మనదేశంలో ఫ్లయింగ్ స్కూళ్ల సంఖ్య పెంచేందుకు విమానయాన శాఖ అధికారులు చర్యలు ఆరంభించారు. ప్రతి ఫ్లయింగ్ స్కూల్ లోనూ తగిన భద్రత, శిక్షణ ప్రమాణాలు ఉండే విధంగా పర్యవేక్షిస్తున్నారు. కమర్షియల్ పైలట్ శిక్షణ స్కూళ్లు తక్కువగా ఉండడంతో దేశంలో శిక్షణ పొందిన, అనుభవజ్ఞులైన పైలెట్లకు కొరత ఎదురవుతోంది.డిజిసిఏ డేటా ప్రకారం 2023 తో పోలిస్తే, 2024 లో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ల సంఖ్య 17 శాతం తగ్గింది. చాలా మంది శిక్షణ కోసం విదేశాలలోని పైలెట్ శిక్షణ కేంద్రాలకు వెళ్తున్నారు. వచ్చే దశాబ్దంలో ప్రధానంగా శిక్షణ పొందిన పైలట్ లకు బాగా డిమాండ్ ఉంటుందని అంచనా. మున్ముందు 20 వేల మందికి పైగా కొత్త పైలట్ లకు అవకాశాలు రావచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News