Thursday, May 29, 2025

ఝార్ఖండ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత హతం

- Advertisement -
- Advertisement -

ఝార్ఖండ్ లోని పలాము జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దాటాక భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో నిషేధిత సీపీఐ మావోయిస్టుకు చెందిన అగ్ర కమాండర్ తులసి భూనియన్ హత మయ్యాడు. రూ.15 లక్షల రివార్డు ఉన్న మరో మావోయిస్టు తీవ్రంగా గాయపడినట్టు సీనియర్ పోలీస్ అధికారి మంగళవారం తెలిపారు. వీరి నుంచి పలు రకాల ఆయుధాలు, రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మొమమ్మద్ గంజ్, హైదర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సీతాచుయాన్ ఏరియాలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. సోమవారం ఝార్ఖండ్ లోని లాతహోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా మావోయిస్టు సభ్యుడు మనీశ్ యాదవ్ మృతి చెందాడు. అతడిపై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. రూ. 10 లక్షల రివార్డు ఉన్న పార్టీ జోనల్ కమాండర్ కుందన్ సింగ్ ఖర్వర్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు.

మనీశ్, కుందన్ గత 12 ఏళ్లుగా హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్నారు. మనీశ్‌పై 40 కేసులు ఉండగా, కుందన్‌పై 27 కేసులు ఉన్నాయి. 2013 జనవరి 7న బర్వడిహ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అమ్‌వాటికర్ టోలా వద్ద భారీ ఎన్‌కౌంటర్‌లో కూడా వీరి ప్రమేయం ఉంది. ఆ ఎన్‌కౌంటర్‌లో 10 మంది పోలీసులు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. మే 24న నిషేధిత ఝార్ఖండ్ జన్ ముక్తి పరిషద్ (జెజెఎంపీ) చీఫ్ , రూ. 10 లక్షల అవార్డు ఉన్న పప్పులోహ్రా , అతని సహచరుడు ప్రభాత్ గంఝు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. గంఝుపై రూ.5 లక్షల అవార్డు ఉంది. లోహ్రా పై హత్య, హింస, దౌర్జన్యం తదితర సంఘటనలపై 98 కేసులు ఉన్నాయి. గంఝుపై 15 కేసులు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి 2021 సెప్టెంబర్‌లో ఝార్ఖండ్ జగ్వార్ డిప్యూటీ కమాండెంట్ రాజేష్ కుమార్‌ను హత్య చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News