- Advertisement -
ఢిల్లీలో పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్ లో మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సినీనటి శోభన పద్మభూషన్ అందుకోగా.. ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందకి పద్మభూషణ్ , 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
- Advertisement -