Thursday, May 29, 2025

ఒక విద్యార్థిని జీవితాన్ని నాశనం చేస్తారా ? : బాంబే హైకోర్టు ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

ఒక విద్యార్థిని అరెస్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె జీవితం నాశనం చేస్తారా ? అని ప్రశ్నించింది. మహారాష్ట్రలో పుణె లోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని ఆపరేషన్ సిందూర్‌పై పోస్టు పెట్టింది.న అది విమర్శనాత్మకంగా ఉండటంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. తర్వాత ఆమెను పుణె లోని ఎరవాడ జైల్లో ఉంచారు. దీనిపై ఆ విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించారు. సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయని ఈ పిటిషన్‌ను వెంటనే విచారించాలని ఆమె తరఫు న్యాయవాది అభ్యర్థించారు.

దీనిని పరిగణన లోకి తీసుకునేందుకు హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెను విడుదల చేయాలని ఆదేశించింది. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినంత మాత్రాన అరెస్టు చేయలేరని అసహనం వ్యక్తం చేసింది. ‘ఇదేం ప్రవర్తన? ఒక విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తున్నారా ? ఆమెను వివరణ కోరారా ? అని ప్రశ్నలు వేసింది. ఇక ఆమె పోలీసుల భద్రతతో పరీక్షలకు హాజరు కావొచ్చని కళాశాల తరఫు న్యాయవాది వినిపించిన వాదనను తోసిపుచ్చింది. ఆమె నేరస్థురాలు కాదని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News