- Advertisement -
భార్యాభర్తల గొడవల కారణంగా భర్త మృతి చెందిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే.. వనస్థలిపురం పోలీసులు తెలిపిన కథనం ప్రకారం…. నల్గొండ జిల్లా నారాయణపురంకు చెందిన సభావత్ కిషన్ (40) లేబర్‌గా పని చేస్తూ వనస్థలిపురం హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కిషన్ మొదటి భార్య చనిపోతే వలిగొండ మండలానికి చెందిన శిరీషను రెండో వివాహం చేసుకున్నాడు. సోమవారం రాత్రి శిరీష, కిషన్‌కు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య గొడవ జరగగా కిషన్ కింద పడిపోయి మృతి చెందాడు. దీంతో కిషన్ మొదటి భార్య కుమారై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -