Sunday, August 31, 2025

ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా.. : వన్డే సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

మహిళల వన్డే ట్రై సిరీస్‌లో ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టు (Ind W) త్వరలో ఆస్ట్రేలియా మహిళలతో తలపడనుంది. స్వదేశంలో ఆసీస్ వుమెన్స్ జట్టుతో (Aus W) మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బిసిసిఐ విడుదల చేసింది. సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగనుంది. ఈ ఏడాది చివర్లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌ కోసం ఇరు జట్ల సన్నాహాల్లో భాగంగా ఈ సిరీస్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ సిరీస్ సెప్టెంబర్ 14, 17, 20 తేదీల్లో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి వన్డే ప్రపంచకప్‌లో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొనాలని భారత మహిళల జట్టు భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News