Saturday, July 19, 2025

తిరుమలలో మరోసారి అపచారం.. ఆలయంపై విమానం చక్కర్లు

- Advertisement -
- Advertisement -

తిరుమల: కలియుగ దైవం తిరుమల (Tirumala Temple) వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మరోసారి అపచారం చోటు చేసుకుంది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం ఆలయంపై నుంచి విమానాలు వెళ్లకూడదు. దీంతో తిరుమలని నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని అనేక మార్లు కేంద్రంన్ని కోరిన ఫలితం రాలేదు. తాజాగా ఆలయంపై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

దీంతో విమానం చక్కర్లపై టిటిడి భద్రత అధికారులు ఆరా తీస్తున్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత తిరుమలలో హైఅలర్ట్ ప్రకటించారు. తిరుమలకు(Tirumala Temple) ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అయితే గత నెల 8వ తేదీన కూడా ఆలయంపై నుంచి విమానం చక్కర్లు కొట్టింది. ఇప్పుడు మరోసారి అలాంటి అపచారమే జరగడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News