Sunday, August 3, 2025

ఆకాశంలో విమానాన్ని ఢీకొట్టి పక్షి.. పైలట్ ఏం చేశారంటే..

- Advertisement -
- Advertisement -

పాట్నా: దాదాపు 4వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఇండిగో విమానాన్ని (Indigo Flight) ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో కొంత సమయం ఆ విమానంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కానీ, పైలట్ అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం పాట్నా నుంచి రాంచీ రావాల్సిన ఇండిగో ఎయిర్‌బస్ 320 విమానం గాల్లో ఉండగా.. సమయంలో పక్షి కొట్టింది. దీంతో విమానానికి పగుళ్లు ఏర్పడ్డాయి.

అయితే వెంటనే పైలట్ అప్రమత్తమై విమానాన్ని రాంచీ బిర్సా ముండా విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న 175 మంది ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని.. పక్షి ఢీకొట్టడంతో విమానానికి పగుళ్లు ఏర్పడ్డాయని.. ఇంజనీర్లు నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయ డైరెక్టర్ ఆర్ఆర్ మౌర్య తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News