Friday, June 6, 2025

పాక్‌పై భారత్ ఆపరేషన్ సింధూ…. ఖరీఫ్ పంటలకు నీటి కటకట

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ భారత్‌పై దూకుడుకు దిగింది కానీ, ఈ క్రమంలో కమ్ముకొస్తున్న సింధూ ముప్పును గుర్తించలేకపోయింది. పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఓ వైపు సిందూర్ ఆపరేషన్‌తో పాక్‌పై విరుచుకుపడింది. దౌత్య బహిష్కరణతో పాటు అత్యంత కీలక రీతిలో సింధూ నదీజలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు, ఇక ఇక్కడి నుంచి సింధూ జలాలు అటువైపు వెళ్లవని ప్రకటించింది. దీనితో సిందూర్‌తో పోలిస్తే పాకిస్థాన్‌కు ఇప్పుడు సింధూ ఎఫెక్ట్ బాగా పడింది. ఇప్పటి ఖరీఫ్ పంటల కాలానికి నాట్లు వేసుకోవడంలో చిక్కులు ఎదుర్కోనుంది.

భారత్ కీలక నిర్ణయంతో సింధూ నదీ వలయంలో అవసరం అయిన జలాలు అందుబాటులోకి రావడం కష్టం కానుంది. దీనితో నాట్లు వేసుకునే పనులకు గడ్డు పరిస్థితి ఏర్పడనుంది. భారత్‌పై వ్యతిరేక చర్యలు, అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రయోజనాల రక్షణకు పాటుపడుతున్న హెహబాజ్ ప్రభుత్వం పొంచి ఉన్న పంట ముప్పును సరిగ్గా పసికట్టలేకపోతోంది. సింధూ, జీలం చెనాబ్ నదులకు ప్రవాహాలు తగ్గుముఖం పట్టాయి. దీనితో అనుసంధాన భూముల్లో పంటలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడనుంది. తమ పలు జలాశయాలలో నీటి మట్టం తగ్గిందని ఇటీవలే పాకిస్థాన్ జల వ్యవహారాల విభాగం తెలిపింది. ఎగువన భారత్ నుంచి జలం నిలిపివేతతో క్రమేపీ పాక్‌లో ప్రవహించే నదులలో జలం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. సోమవారంతో పాకిస్థాన్ పంజాబ్ ప్రాంతంలోని సింధూ నది వ్యవస్థలో నీటి మట్టం దాదాపు 11 శాతం తగ్గుముఖం పట్టిందని అధికారికంగా ప్రకటించారు.

ఖరీఫ్ పంటల నాట్లకు నీటి అవసరం ఎంతైనా కావాలి. రాబోయే రోజులలో నీటి మట్టం మరింత తగ్గితే పరిస్థితి ఏమిటనేది అధికారుల కన్నా స్థానిక ప్రజలను తీవ్రస్థాయిలో కలవరపరుస్తోంది. వాతావరణ పరిస్థితుల వల్ల పాకిస్థాన్‌కు నైరుతి రుతుపవనాలు రావడం మరో నాలుగు వారాలకు కానీ వీలుకాదు. అప్పటికైనా వర్షాల పరిస్థితి ఏమిటనేది ఆందోళనకరం అయింది. జూన్ చివరి నాటికి కానీ వర్షాలు రావు. అప్పటివరకూ నాట్ల పని అయోమయం అవుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితిని గమనించే ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంతర్జాతీయ వేదికల నుంచి తరచూ సింధూ జలాల ఒప్పందం అమలు జరిగితీరాల్సిందే అని చెపుతున్నారు. అయితే భారత్ ఏ పరిస్థితుల్లో ఒప్పందం నుంచి వైదొలిగిందనే కారణాలను ఆయన విలేకరులు ప్రశ్నించినా చెప్పలేని సంకట స్థితి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News