Wednesday, July 30, 2025

‘తెలుసు కదా’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’ (Telusu kada) తో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ , టిజి కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. అక్టోబర్ 17, 2025న సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ ప్రీ దీపావళి ధమాకాతో(Diwali dhamaka) దీపావళి మరింత సందడిగా మారబోతోంది.

రిలీజ్ డేట్ పోస్టర్ విజువల్ ఫీస్ట్‌లా వుంది. ప్రేక్షకులను తెలుసు కదా వరల్డ్ లోకి తీసుకెళ్ళింది. అనౌన్స్‌మెంట్ వీడియో కూడా ఆసక్తికరంగా వుంది. దర్శకురాలు నీరజ కోన తన మొదటి చిత్రంతో తెలుగు సినిమాకు ఒక కొత్త వాయిస్ ని అందిస్తున్నారు. ఇది మనసుని తాకేలా, ఊహించని మలుపులతో నిండిన కథగా వుండబోతోంది. సిద్ధు జొన్నలగడ్డ జీవంతో నిండిన పాత్రలో ఆకట్టుకోనున్నారు. ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News