క్వీన్ అనుష్క శెట్టి… క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ’ఘాటి’ (Ghati) గ్లింప్స్‌లో ఇంటెన్స్ వయోలెంట్ క్యారెక్టర్లో అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీని తర్వాత తమిళ స్టార్ విక్రమ్ ప్రభు ఇంటెన్స్ అవతార్ లో కనిపించిన క్యారెక్టర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇది సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. ఘాటిని యువి క్రియేషన్స్ సమర్పిస్తోంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. ఘాటి జూలై 11న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్లో అనుష్క, విక్రమ్ ప్రభు నది గుండా సంచులు మోసుకుంటూ వెళుతున్న విజువల్స్ ఇంటెన్స్ జర్నీని సూచిస్తున్నాయి. ‘ఘాటి’ అనుష్క శెట్టి, (Anushka Shetty) దర్శకుడు క్రిష్ సక్సెస్ఫుల్ మూవీ ’వేదం’తర్వాత కలిసి చేస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్. ఘాటి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.
జూలై 11న ‘ఘాటి’
- Advertisement -
- Advertisement -
- Advertisement -