Saturday, July 26, 2025

అతివేగంతో ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే వృద్ధుడి మృతి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భువనగిరి మండలం వడాయిగూడెం స్టేజి వద్ద అతివేగంతో వెళ్తున్న లారీ (Lorry) ఓ వృద్ధుడిని (Old Man)  ఢీకొంది. ఈ ప్రమాదంలో యాదగిరిగుట్టకు చెందిన కీర్తి వెంకటేశ్వర్లు (60) అక్కడికక్కడే మృతి చెందారు. వడాయిగూడేనికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వెంకటేశ్వర్లు రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. అదే సమయంలో యాదగిరిగుట్ట నుంచి రాయగిరికి వెళ్తున్న లారీ ఆయన్ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వర్లు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతుడి భార్య అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News