- Advertisement -
పవన్‌కల్యాణ్ నటించిన పిరియాడిక్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. పొలిటికల్ గా బిజీగా ఉండటంతో ఈ మూవీ కంప్లీట్ కావడానికి ఐదేళ్లు పట్టింది.ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా బడ్జెట్ కారణంగా నిర్మాత ఏ.ఎం.రత్నం నష్టపోకుండా.. ఆయనను ఆదుకునేందుకు పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ ను నిర్మాతకు పవన్ తిరిగి ఇచ్చేయనున్నట్లు సమాచారం. కాగా, జూన్ 12న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈసినిమాలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ చేశారు. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ మూవీ విడుదల కానుంది.
- Advertisement -