Saturday, June 7, 2025

గురువారం రాశి ఫలాలు (05-06-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవడానికి గాను మీరు చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం – మీ అంచనాలు నిజమవుతాయి. క్రమశిక్షణలోపించకుండా జాగ్రత్తలు వహించండి. మనస్సు విశ్రాంతిని కోరుకుంటుంది. అయితే పరిస్థితులు అందుకు సహకరించవు. ఆత్మీయులతో విభేదాలు వస్తాయి.

మిథునం –  దీర్ఘాలోచనల వలన ప్రయోజనం ఉండదు. సన్నిహిత మిత్రబృందంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. స్థిరత్వం ధైర్యం వలన అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు.

కర్కాటకం – నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం.  గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.  ఇంటా బయట మీ మాటే చెల్లుబాటు కాగలదు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

సింహం – దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కన్య – బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది.

తుల – నూతన పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. ఆరోగ్యం కొంత నలతగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కొన్ని అవకాశాలు అనుకోకుండా లభిస్తాయి.

వృశ్చికం – విలువైన వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి.

ధనున్సు –  సంతాన పురోగతి బాగుంటుంది. వాహన సౌఖ్యం పొందుతారు.నచ్చని విషయాలను నిర్భయంగా వెల్లడిస్తారు. నూతన పెట్టుబడులలో తొందరపాటు వద్దు.గృహం కొనుగోలు యత్నాలు ఆచరణలో పెడతారు.

మకరం – స్థలాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. సభలు సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు స్థాన మార్పులు సూచన గోచరిస్తుంది.

కుంభం – ఆర్థికంగా లోటు ఉండదు. అయినప్పటికీ ధనం సంపాదించాలంటే విదేశాలకు వెళ్లాల్సిందేనన్న భావనలు దృఢపడతాయి. కుటుంబంలోని ఐక్యమత్యం మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

మీనం – ప్రజా సంబంధాలు అధికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యధాతధంగా ఉంటుంది. చేతికంది వచ్చిన చిన్న అవకాశాలను కూడా చేజార్చుకోరు.

Guruvaram rasi phalalu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News