Wednesday, June 18, 2025

భారీ అంచనాల మధ్య థగ్ లైఫ్

- Advertisement -
- Advertisement -

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ డ్రామా ‘థగ్ లైఫ్’ గురువారం థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ‘నాయకుడు’ సినిమా తర్వాత దాదాపు 38 ఏళ్లకు ఈ క్రేజీ కాంబో వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నాయకుడు’ ఇండియన్ సినిమా చరిత్రలో ఓ లెజెండరీ మూవీగా నిలిచిపోయింది. అదే స్థాయిలో ‘థగ్ లైఫ్’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలో శింబు, అశోక్ సెల్వన్, త్రిష కృష్ణన్, అభిరామి లాంటి స్టార్ తారాగణం కీలక పాత్రలు పోషించడం మరింత ఆసక్తిని పెంచుతోంది. హీరో నితిన్ ఫాదర్ ఎన్. సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది. విక్రమ్, అమరన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ నుంచి వస్తున్న థగ్ లైఫ్.. ఆ సంస్థకు హ్యాట్రిక్ విజయాన్ని అందిచడం ఖాయమనే అంచనాలున్నాయి.

హీరోగా ఫుల్ బిజీగా ఉన్న శింబు.. కేవలం మణిరత్నం, కమల్ హాసన్ కోసం ఈ సినిమాలో నటించారు. శింబు క్యారెక్టర్ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. అలాగే.. పొన్నియన్ సెల్వన్‌తో కంబ్యాక్ ఇచ్చిన త్రిష ఈ సినిమాలో నటిస్తుండడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. త్రిష కెరీర్‌లో ఇంత వరకు పోషించని ఓ కొత్త పాత్రను ఇందులో పోషిస్తున్నారు. ఇక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ థగ్ లైఫ్‌ను నెక్స్ లెవెల్‌కి తీసుకెళ్లేలా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News