Wednesday, September 10, 2025

మేం బాధ్యత తీసుకోవాల్సిందే.. తొక్కిసలాట ఘటనపై బిసిసిఐ

- Advertisement -
- Advertisement -

ఆర్‌సిబి ఐపిఎల్ ట్రోఫీ గెలుచుకున్న వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ పరేడ్‌లో తొక్కిసలాట (Bengaluru Stampede) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రతీ ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని మండిపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై బిసిసిఐ (BCCI) స్పందించింది.

ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని బిసిసిఐ (BCCI) స్ఫష్టం చేసింది. ఇలాంటి ఘటనలను (Bengaluru Stampede) మౌనంగా చూస్తూ ఉండలేమని.. ఏదో ఒకటి చేయాలని బిసిసిఐ పేర్కొంది. ‘‘ఇది ఆర్‌సిబికి సంబంధించిన ప్రైవేటు వ్యవహారం. కానీ, ఈ దేశంలో క్రికెట్ వ్యవహారాలకు మేం బాధ్యత తీసుకోవాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాం’’ అని బిసిసిఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News