కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఫోన్ కొనడానికి ఇదే బెస్ట్ టైమ్. అమెజాన్, ఫ్లిప్ కార్డ్ లో బంపర్ ఆఫర్ ఉంది. ఈ ఏడాదిలో మార్కెట్లో విడుదలైన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ రెడ్మి నోట్ 14 ప్రో అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై క్యాష్ బ్యాక్, బ్యాంకు డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా పొందవచ్చు.
డిస్కౌంట్ వివరాలు:
రెడ్మి నోట్ 14 ప్రో స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే రు.2 వేల వరకు బ్యాంకు డిస్కౌంట్, అదేవిధంగా రూ.779 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుకోవచ్చు. దీంతో ఈ ఫోన్ ధర దాదాపు రూ.22,200 వరకు తగ్గుతుంది. కేవలం రూ.1,960 ప్రారంభ ఈఎంఐ ధరతో సొంతం చేసుకోవచ్చు.
మరోవైపు.. ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. దీంతో కొనుగోలు ధర రూ.24,500కు తగ్గుతుంది. ఒకవేళ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.7000 కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఫీచర్లు:
రెడ్మి నోట్ 14 ప్రో 6.67 అంగుళాల FHD+ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే తో వస్తుంది. అలాగే, 120HZ హై రిఫ్రెష్ రేటుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ దాదాపు 3000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్ నెస్ లెవెల్స్ అందుకుంటుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ నడుస్తుంది. అంతేకాకుండా.. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లను కలిగి ఉంది.
బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ తో 5,500 mah బ్యాటరీ తో వస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే రోజంతా వస్తుంది. ఇక కెమెరా గురించి మాట్లాడితే.. ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ త్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.ఇందులో 50MP మెయిన్ OIS కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం.. 32MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.