ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ బైక్‌లకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. 100 సిసి-125 సిసి ఇంజిన్లు కలిగిన బైక్‌లు బెస్ట్ సెల్లర్లు. కానీ, పవర్‌తో పాటు ఎక్కువ మైలేజీని కోరుకునే వారు 125 సిసి బైక్‌ను పరిగణిస్తారు. అయితే, మీరు రోజువారీ ఉపయోగం కోసం, ఆఫీసుకు వెళ్లడానికి కూడా అలాంటి బైక్ కోసం చూస్తున్నట్లయితే, మీకు ప్రయోజనకరంగా ఉండే 2 ఉత్తమ ఎంపికలను ఇక్కడ చూద్దాం.
హీరో సూపర్ స్ప్లెండర్
హీరో సూపర్ స్ప్లెండర్ 125 బైక్ మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. ఇది క్లీన్ డిజైన్‌లో వస్తుంది. ఈ బైక్‌లో 124.7 సిసి ఇంజిన్ ఉంటుంది. ఈ బైక్ 10.7 బిహెచ్పి, 10.6 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.అంతేకాకుండా 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను కూడా కలిగి ఉంది. ఈ బైక్ ఒక లీటరులో దాదాపు 69 కి.మీ వరకు మైలేజీని ఇస్తుంది. దీనికి ముందు టైర్లో 240 mm డిస్క్, వెనుక టైర్లో 130 mm డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. ఈ బైక్ 18 అంగుళాల టైర్లతో అమర్చబడి ఉంది. ఇది రోజువారీ వినియోగానికి మంచి బైక్ గా ఉపయోగపడుతుంది. కాగా, బైక్ ధర రూ. 86128 నుండి ప్రారంభమవుతుంది.
హోండా షైన్ 125
హోండా షైన్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సరసమైన 125cc బైక్. ఇది రోజువారీ వినియోగానికి ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఈ బైక్ 124 cc SI ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 7.9 kW శక్తిని, 11 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్ సౌకర్యం ఉంది. ARAI ప్రకారం.. ఈ బైక్ ఒక లీటరు పెట్రోల్‌తో దాదాపు 65 కి.మీ ప్రయాణిస్తుంది. దీనికి ముందు భాగంలో 240 mm డిస్క్, వెనుక భాగంలో 130 mm డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. దీనికి 18 అంగుళాల టైర్లు ఉన్నాయి. బైక్ ఎక్స్-షోరూమ్ ధర 85 వేల నుండి ప్రారంభమవుతుంది.