Sunday, June 8, 2025

కపిల్ దేవ్ రికార్డును బద్దలుకొట్టిన స్కాట్‌లాండ్ క్రికెటర్

- Advertisement -
- Advertisement -

టీం ఇండియా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సాధించిన ఓ అరుదైన రికార్డును స్కాట్‌లాండ్ యువ క్రికెటర్ బ్రాండన్ మెక్‌ముల్లెన్ (Brandon McMullen)  బద్దలు కొట్టాడు. వన్డే‌ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు, 50 వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023-27 లీగ్ టూర్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెక్‌ముల్లెన్ ఈ ఘనత సాధించాడు. 33వ వన్డేల్లోనే ఈ రికార్డును సాధించడం విశేషం. ఈ క్రమంలో లాన్స్ క్లూజ్‌నర్(42 ఇన్నింగ్స్), కపిల్ దేవ్(46 ఇన్నింగ్స్), స్టీవ్ వా (46 ఇన్నింగ్స్), షకీబ్ అల్ హసన్ (50 ఇన్నింగ్స్) లను అధిగమించాడు. కాగా, ఈ రికార్డు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మొదటిస్థానంలో నెదర్లాండ్స్ ఆటగాడు ర్యాన్ టెన్ డెష్కాట్ ఉన్నాడు. డెష్కాట్ కేవలం 25 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డు సాధించాడు. బ్రాండన్ మెక్‌ముల్లెన్ (Brandon McMullen) 33 మ్యాచుల్లో 4 సెంచరీలు, 4 అర్థ శతకాలు కలిపి 1,149 పరుగులు చేశాడు. 20.29 సగటుతో 52 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో అత్యధిక స్కోర్ 151 కాగా, బౌలింగ్‌లో ఒక ఫైవ్ వికెట్ హాల్ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News