Monday, July 28, 2025

జ్యోతి యర్రాజికి పసిడి పతకం

- Advertisement -
- Advertisement -

తైవాన్: తెలుగు తేజం, ఇండియా హర్డిల్ క్వీన్ జ్యోతి యర్రాజీ (Jyoti Yarraji) మరోసారి సంచలనం సృష్టించింది. తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్-2025లో బంగారు పతకం సాధించింది. శనివారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో జ్యోతి 12.99 సెకన్లలో రేసును పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచింది. చివరి రెండు హర్డిల్స్ వరకు వెనుకంజలో ఉన్న జ్యోతి రెప్పపాటు సమయంలోనే అందరినీ దాటుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో అగ్రస్థానంలో నిలిచిన జ్యోతికి పసిడి పతకం వరించింది. బంగారు పతకం సాధించిన జ్యోతి యర్రాజీకి సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా.. జ్యోతి యర్రాజీ సూపర్ ఫామ్‌లో ఉంది. ఇటీవల సౌత్‌కొరియా వేదికగా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లోనూ జ్యోతి బంగారు పతకం సాధించింది. ఈ టో ర్నీలో 100 మీటర్ల హర్డిల్స్‌ను జ్యోతి 12.96 సెకన్లలోనే పూర్తిచేసి పతకం వడిసిపట్టింది. కేరళ వేదికగా(Kerala vedika) ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన నేషనల్ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ 2025 పోటీల్లోనూ జ్యోతి బంగారు పతకం కైవసం చేసుకుంది. ఇదే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ వేదికగా జరిగిన నేషనల్ గేమ్స్‌లోనూ జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌తో పాటు 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాలు సాధించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News