Friday, September 12, 2025

మట్టికోర్టు రారాణి గాఫ్

- Advertisement -
- Advertisement -

పారిస్: అమెరికా యువ సంచలనం కొకొ గాఫ్ సంచలనం సృష్టించింది. తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్‌గా టైటిల్‌ను ముద్దాడింది. శనివారం జరిగిన టైటిల్ పోరులో గాఫ్ అద్భుత విజయంతో సబాలెంకా(బెలారస్)ను మట్టికరిపించి, మట్టికోర్టు రారాణిగా అవతరించింది. ఉత్కంఠ భరిత పోరులో చెలరేగిన తను ప్రత్యర్థికి చెక్ పెట్టింది. తొలి సెట్‌లో ఓటమిపాలైనా.. రెండో సెట్‌లో అద్భుత ఆటతీరు( Excellent gameplay) తో అలవోకగా విజయం సాధించింది. 62తో సెట్ కైవసం చేసుకొని సమంగా నిలిచింది. అనంతరం నిర్ణాయాత్మక మూడో సెట్‌లో తొలి నుంచే సబాలెంకాపై ఎదురుదాడి దిగి కోర్టంతా పరుగులు పెట్టించింది.

64తో సెట్ కైవసం చేసుకొని విజేతగా నిలిచింది. ఆఖరి పాయింట్ సాధించిన తర్వాత భావొద్వేగానికిలోనైన గాఫ్ కోర్టులోనే కూలబడింది. ఆ తర్వాత సబలెంకతో కరచాలనం చేసి, గ్యాలరీలో ప్రేక్షకులకు, తన తల్లిదండ్రులతో గెలుపు సంబురాలు చేసుకుంది. సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ తర్వాత అమెరికా టెన్నిస్‌లో సంచలనంగా మారిన గాఫ్.. 2023లో యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఈ 21ఏళ్ల యువ సంచలనం ఇప్పటి వరకూ 7 డబ్ల్యూటిఎ టూర్ సింగిల్స్ ట్రోఫీలతో పాలు రెండు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలను కైవసం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News