Sunday, June 8, 2025

ప్రభాస్ సినిమా కోసం గోడ దూకి వెళ్లిన సీనియర్ నటుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్‌కు (Anupam Kher) ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో అనుపమ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆయన గోడ దూకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. తాను గతంలో ఎప్పుడూ ఇలాంటి అనుభవం పొందలేదని పేర్కొన్నారు.

‘‘నా 40 సంవత్సరాల సినీ ప్రయాణంలో సినిమా షూటింగ్‌లకు వివిధ రకాలుగా వెళ్లాను. కానీ, ఈరోజు వెళ్లింది మాత్రం ఎంతో ప్రత్యేకమైనది.. కామెడీగా కూడా ఉంది. ప్రభాస్ నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ కోసం మేం హైదరాబాద్‌లో ఉన్నాము. ఈ ప్రయాణాన్ని మా డ్రైవర్ కాస్త సాహసోపేతం చేయాలని నిర్ణయించాడు. మేం ఒక అడవిలాంటి ప్రదేశం చేరుకున్నాము.. అప్పుడే తెలిసింది అది డెడ్ ఎండ్ అని.. కారు రివర్స్ తీసుకొనే అవకాశం కూడా లేదు. దీంతో ఏం జరిగిందో మీరే చూడండి’’ అంటూ అనుపమ్ (Anupam Kher) తాను గోడ దూకుతున్న వీడియోని పోస్ట్ చేశారు. దీనికి ‘కుచ్ బీ హో సక్త హే’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని కూడా జత చేశారు.

ఇక సినిమా విషయానికొస్తే.. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. సోషల్‌మీడియా స్టార్ ఇమాన్వీ ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News