Monday, June 9, 2025

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్

- Advertisement -
- Advertisement -

ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) పుట్టినరోజు (జూన్ 10) సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ వచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా వివరాలు వెలువడ్డాయి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు బాలకృష్ణ(Balakrishna). ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ గ్రాండ్ సక్సెస్ సాధించింది. దీంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనిపై దర్శకుడు గోపిచంద్ మలినేని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్. ఈ సారి గర్జన్ మరింత గట్టిగా వినిపిస్తుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచపోయే సినిమా’’ అని గోపిచంద్ పేర్కొన్నారు. కాగా, బాలకృష్ణ కెరీర్‌లో ఇది 111వ సినిమా కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News