రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ (sunil)ముఖ్య పాత్రలో నటించనున్నాడు. విభిన్న శైలితో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సునీల్, “మర్యాద రామన్న”, “అందాల రాముడు, “‘పుష్ప” వంటి విజయవంతమైన చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన చేరికతో ఈ చిత్రానికి కొత్త ఉత్సాహం, విస్తృత ప్రజాప్రాచుర్యం లభించనున్నది. ఈ చిత్రంలో సునీల్ పోషించనున్న పాత్ర చాలా ప్రత్యేకమైనది. (role played very special) హాస్యం, హృద్యత, భావోద్వేగాలు మిళితమైన ఈ పాత్ర ఆయన నటనకు మరో కొత్త కోణాన్ని పరిచయం చేయనుంది.
ఇది ఆయన సినీ ప్రయాణంలో ఒక విభిన్నమైన మలుపు అని చెప్పవచ్చు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ.. ‘సునీల్ ప్రేక్షకుల్లోకి దగ్గరయ్యే నటుడు మాత్రమే కాదు, ఒక సహజ నటనకు నిలువెత్తు ఉదాహరణ. ఈ సినిమాలో ఆయన చేయబోయే పాత్ర ఆయన ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నమైనది. ఇది హృదయానికి హత్తుకునే, చాలా సహజమైన పాత్ర’ అని తెలిపారు. చిత్రానికి సంబంధించిన అధికారిక టైటిల్ను జూన్ 15న విడుదల చేయనున్నారు.