Friday, July 18, 2025

ఆర్‌సిబి అప్పుడే గెలిచుంటే.. ఈ అనర్థం జరిగేది కాదు..: గవాస్కర్

- Advertisement -
- Advertisement -

18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఐపిఎల్ ఛాంపియన్స్‌గా మారిన విషయం తెలిసిందే. తొలిసారి కప్పు గెలవడంతో ప్రతీ ఆర్‌సిబి అభిమాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆర్‌సిబి విజయోత్సవ సభలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిన్నస్వామి స్టేడియం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. తాజాగా ఈ ఘటనపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) స్పందించారు. ఐపిఎల్ ప్రారంభమైన కొన్నాళ్లకే ఆర్‌సిబి టైటిల్ గెలిచి ఉంటే అభిమానుల్లో ఈ స్థాయిలో భావోద్వేగం ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు.

ఇతర జట్లు కూడా ఐపిఎల్ ట్రోఫీలు సాధించాయి కానీ, ఆ జట్ల విజయోత్సవాల్లో ఇంతలా హడావుడి లేదని అన్నారు. ఎందుకంటే ఆ జట్ల అభిమానులు ట్రోఫీ కోసం ఎక్కువగా ఎదురుచూసే అవసరం రాలేదని అన్నారు. ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటేనే ఆర్‌సిబి గుర్తొచ్చేదని.. కానీ ఈసారి ఆ నినాదం అంతగా వినిపించలేదని పేర్కొన్నారు. ‘‘ప్రత్యర్థి మైదానంలో ఆడిన ప్రతీ మ్యాచ్‌లో విజయం సాధించి ఐపిఎల్‌లో ఆర్‌సిబి చరిత్ర సృష్టించింది. ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడి.. ట్రోఫీ కలను సాకారం చేసుకుంది. ఆర్‌సిబికి బెంగళూరులో అద్భుతమైన రీతిలో స్వాగతం పలకాలని కోరుకోవడం కరెక్టే. కానీ, చిన్నస్వామి వెలుపల జరిగిన తొక్కిసలాటలో అభిమానులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. ఇది విషాదకర ఘటన. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారిని నా సానుభూతి’’ అని గవాస్కర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News